విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దాదాపు మూడున్నరేళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ చిత్రం, ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. బుధవారం అర్థరాత్రి నుంచే యూఎస్ ప్రీమియర్స్ ద్వారా సందడి మొదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సత్యదేవ్, వెంకటేష్ కేవీ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. కొద్దిసేపటి క్రితమే యుఎస్ ప్రీమియర్ షో ముగియడంతో టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసినవాళ్ళు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు. ట్విట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.











